బేఫికర్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్..!

Vaani Kapoor with Hrithik Roshan, Tiger Shroff in Siddharth Anands next

నాలుగేళ్ల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన ఓ బాలీవుడ్ హీరోయిన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. శుద్ దేశీ రొమాన్స్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన వాణీ కపూర్ తరువాత సౌత్ లో ఆహా కళ్యాణం, బేఫికర్ సినిమాల్లో నటించినా.. సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించనుంది.

యష్ రాజ్ ఫిలింస్ సంస్థ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో వాణీకపూర్ హీరోయిన్ గా నటించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణీ హృతిక్ రోషన్ కు జోడిగా నటించనుందట. ఈ సినిమాలో హృతిక్, టైగర్ లు ఒకరితో ఒకరు తలపడే పాత్రల్లో నటించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top