ఉయ్యాల...జంపాల | Uyyala Jampala comes with entire new team | Sakshi
Sakshi News home page

ఉయ్యాల...జంపాల

Nov 5 2013 12:13 AM | Updated on Sep 2 2017 12:16 AM

ఉయ్యాల...జంపాల

ఉయ్యాల...జంపాల

అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే,

అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే, అంతా కొత్త టీమ్‌తో ఈ సినిమా నిర్మించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం! ఇన్ని ఆసక్తులకు నెలవుగా నిలిచిన సినిమా ‘ఉయ్యాల జంపాల’. విరించి వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రాచుర్యం  పొందిన ఆనంది, రాజ్‌తరుణ్ ఇందులో నాయికా నాయకులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్.పి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ నెలలో పాటలను త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వ డి.బి., సంగీతం: సన్నీ ఎం.ఆర్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాతలు: నాగార్జున, రామ్మోహన్ పి.
 

Advertisement
 
Advertisement
Advertisement