గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేస్తూ, రంగుల ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న తెలుగమ్మాయి నటి ఆనంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే..
నా పేరు అది కాదు..
నా అసలు పేరు రక్షిత. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ‘ఆనంది’గా మారాను. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లో. పక్కా తెలంగాణ అమ్మాయినే అయినా, చెన్నై వెళ్లాక తమిళ సంస్కృతికి కూడా బాగా కనెక్ట్ అయిపోయాను.
బాల్యం ఇచ్చిన బలం!
చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్‌పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగా
స్ట్రాంగ్‌గా చేశాయి.
నా చాయిస్ సైలెంట్ లైఫ్!
సినిమాల్లో నేను ఎంత సైలెంట్‌గా కనిపిస్తానో, నిజ జీవితంలో కూడా అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్‌తో నా వివాహం 2021లో చాలా సింపుల్‌గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ
లో ప్రొఫైల్‌లోనే ఉండాలని నేను కోరుకుంటాను.
ఒక్క సినిమా, జీవితాన్ని మార్చింది!
‘బస్టాప్’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. కానీ ‘కాయల్’ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత అందరూ నన్ను ‘కాయల్ ఆనంది’ అని పిలవడం మొదలుపెట్టారు. అది నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు.
పుస్తకాలే నా ప్రపంచం!
నేను ఒక పక్కా బుక్‌వర్మ్. నా బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పె¯Œ ్స, థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.
నో డైట్!
ఫుడ్‌లో తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. డైట్ పేరుతో నన్ను నేను కష్టపెట్టుకోను. మితంగా తినడం, సింపుల్‌గా జీవించడం నా స్టైల్.
పవర్‌ఫుల్ పాత్రలు!
సినిమాల్లో ‘విలేజ్ గర్ల్’ పాత్రలే ఎక్కువగా వచ్చినా, ‘జాంబీ రెడ్డి’లాంటి సినిమాలతో నాలోని మరో కోణాన్ని చూపించగలిగాను. నటిగా ఏ ఒక్క ఇమేజ్‌కో పరిమితం కాకుండా, భవిష్యత్తులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ఒక పవర్‌ఫుల్ పీరియడ్ డ్రామాలో నటించాలన్నదే నా ఆశ.


