బారిష్టర్ శంకర్‌నారాయణ్ | upcoming movie barister sankar narayan | Sakshi
Sakshi News home page

బారిష్టర్ శంకర్‌నారాయణ్

Aug 30 2013 12:56 AM | Updated on Sep 1 2017 10:14 PM

బారిష్టర్ శంకర్‌నారాయణ్

బారిష్టర్ శంకర్‌నారాయణ్

‘‘తన వాగ్దాటితో ఎంతటివారినైనా బోల్తా కొట్టించగల న్యాయవాది శంకర్‌నారాయణ్. ఆయనో కేసు టేకప్ చేస్తే, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే.

‘‘తన వాగ్దాటితో ఎంతటివారినైనా బోల్తా కొట్టించగల న్యాయవాది శంకర్‌నారాయణ్. ఆయనో కేసు టేకప్ చేస్తే, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. అలాంటి బారిష్టర్ జీవితంలో ఓ కేసు మూలంగా ఏర్పడిన మలుపులే ఈ సినిమా నేపథ్యం’’ అని దర్శకురాలు తార చెప్పారు. 
 
 రాజ్‌కుమార్ హీరోగా నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రామారాజ్‌కుమార్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘బారిష్టర్ శంకర్‌నారాయణ్’. వచ్చే నెల 2న పాటల్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజ్‌కుమార్ తెలిపారు.
 
 అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమెరా: ముప్పాళ్ల మహేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎల్.వేణుగోపాల్.
 

Advertisement
 
Advertisement
Advertisement