ఆడపిల్లని తక్కువగా చూడకూడదు | undiporaadhey song release by sudheer babu | Sakshi
Sakshi News home page

ఆడపిల్లని తక్కువగా చూడకూడదు

Jun 24 2019 1:04 AM | Updated on Jun 24 2019 5:28 AM

undiporaadhey song release by sudheer babu - Sakshi

డా.లింగేశ్వర్‌, సుధీర్‌బాబు

‘‘ఓ తండ్రి కోసం కూతురు పాడే ఈ పాటలో చక్కటి విలువలున్నాయి. ఆడపిల్లని తక్కువగా చూడకూడదు.. ఆడపిల్ల పుట్టుక చాలా అవసరం.. అని తెలియజెప్పే ఈ పాట వల్ల కొంత మందైనా మారాలనుకుంటున్నాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. తరుణ్‌ తేజ్, లావణ్య జంటగా నవీన్‌ నాయని దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. గోల్డ్‌ టైమ్‌ ఇన్‌ పిక్చర్స్‌ పతాకంపై డా.లింగేశ్వర్‌ నిర్మించిన ఈ సినిమా జూలై నెలాఖరులో విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తండ్రి గొప్పతనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు.

నవీన్‌ నాయని మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్‌ స్టోరీ. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ఇటీవలే కన్నడలో మా ఆడియో విడుదలవగా, మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. డా.లింగేశ్వర్‌ మాట్లాడుతూ– ‘‘ఇంత వరకు వెండితెరపై రానటువంటి కథ ‘ఉండిపోరాదే’. సుద్దాల అశోక్‌తేజగారు నాన్నపై  రాసిన పాటకు అవార్డ్స్‌ వస్తాయనడంలో సందేహం లేదు.

ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం ఉంటుంది. కథ మీద ఎంతో నమ్మకంతోనే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మి ంచా’’ అన్నారు. ‘‘ సుద్దాలగారు మంచి సాహిత్యం అందించారు. పాటకు చిత్రగారు ప్రాణం పోశారు’’ అని సంగీత దర్శకుడు సబు వర్గీస్‌ అన్నారు. తరుణ్‌ తేజ్, లావణ్య, నటుడు కేదార్‌ శంకర్, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీను విన్నకోట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement