డబ్బులు తిరిగిచ్చేయనున్న టాప్‌ హీరో | Tubelight: Salman Khan to pay distributors who suffered losses due to film’s poor show at the Box Office? | Sakshi
Sakshi News home page

డబ్బులు తిరిగిచ్చేయనున్న టాప్‌ హీరో

Jul 7 2017 7:32 PM | Updated on Sep 5 2017 3:28 PM

డబ్బులు తిరిగిచ్చేయనున్న టాప్‌ హీరో

డబ్బులు తిరిగిచ్చేయనున్న టాప్‌ హీరో

భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్‌ తాజా సినిమా ‘ట్యూబ్లైట్’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్‌ తాజా సినిమా ‘ట్యూబ్లైట్’  బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు రంజాన్‌కు విడుదలైన ఏక్‌ థా టైగర్‌, బజరంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్‌ ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇదే ఏడాది రంజాన్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ట్యూబ్లైట్’  ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కనీసస్థాయిలో కూడా కలెక్షన్లు వసూలు కాలేదు. తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కలిగించాలని సల్మాన్‌ నిర్ణయించినట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

తన సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రూ. 55 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయినట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు వరకు చెల్లించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ట్యూబ్లైట్ నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి సినిమా ‘టైగర్ జిందాహై’పై పడింది. పాత అగ్రిమెంట్లను సవరించాలని సల్మాన్పై డిస్ట్రిబ్యూటర్లు వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement