టీఆర్‌ఎస్‌కు సినీతారల ‘విజయాభినందనలు’ | Tollywood Celebrities Greets TRS Party And Leaders | Sakshi
Sakshi News home page

Dec 11 2018 3:54 PM | Updated on Dec 11 2018 5:52 PM

Tollywood Celebrities Greets TRS Party And Leaders - Sakshi

తెలంగాణలో ఘనవిజయం దిశగా దూసుకుపోతోన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి ఆ పార్టీ నాయకులకు సినీ తారల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఘనవిజయం సాధించటంతో హీరోలు.. టీఆర్‌ఎస్‌ పార్టీని కేసీఆర్‌, కేటీఆర్‌లను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ కేసీఆర్‌గారికి హృదయపూర్వక విజయాభినందలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాలుగున్నరేళ్ల కాలం పాటు పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న శ్రీ కే చంద్ర శేఖర రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు.

​హీరోలు శ్రీకాంత్‌, సుధీర్‌ బాబు, నాని, నిఖిల్‌, మంచు మనోజ్‌ లతో పాటు దర్శకులు హరీష్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని, మెహర్‌ రమేష్‌, కోన వెంకట్‌, మధుర శ్రీధర్‌ లాంటి సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement