అద్భుతమైన కళాకారుడు అలీ

Tollywood actor Ali Couple felicitated By Brahmanandam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు అలీ అద్భుతమైన కళాకారుడని, విలువలుగ వ్యక్కి అని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం కితాబిచ్చారు. ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చూన్‌ ఇన్‌ఫ్రా సౌజన్యంతో పద్మ మోహన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో అలీ, జుబేదా దంపతులకు ‘పద్మ మోహన స్వర్ణ కంకణం, విశిష్ట దంపతులు, జీవిత సాఫల్య పురస్కారాన్ని’ గురువారం రవీంద్రభారతిలో ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. సామాన్యంగా కొన్ని వంద సినిమాలు చూడడమే కష్టమని.. అలాంటిది కొన్ని వందల సినిమాల్లో నటించడం అలీకే చెల్లిందన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పలు భాషలలో 11 వందల సినిమాలలో నటించాను. త్వరలో దబాంగ్‌–3, హాలీవుడ్‌ చిత్రం గోల్డెన్‌ బర్డ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’ అని పేర్కొన్నారు. కాగా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు ఇదే వేదికపై పద్మ మోహన అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top