సునామీ నేపథ్యంలో... | Tolipremalo Movie Platinum Disc Function | Sakshi
Sakshi News home page

సునామీ నేపథ్యంలో...

Aug 17 2016 11:20 PM | Updated on Sep 4 2017 9:41 AM

సునామీ నేపథ్యంలో...

సునామీ నేపథ్యంలో...

‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం ‘కయల్’.

 ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం ‘కయల్’. చంద్రన్, ఆనంది, ప్రభు ముఖ్య పాత్రధారులు. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని గౌళీకార్ శ్రీనివాస్ సమర్పణలో  తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ తెలుగులో ‘తొలిప్రేమలో’ పేరుతో విడుదల చేస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు.  దర్శకుడు మాట్లాడుతూ-‘‘సునామీ వచ్చినప్పుడు కన్యాకుమారిలోని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి భావోధ్వేగాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సాగే చిత్రమిది.
 
  తమిళంలో మంచి వసూళ్లు సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘ఫీల్ గుడ్ టైటిల్ ఇది. పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. మా చిత్రం విడుదల విషయంలో శోభారాణిగారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.  ఈనెల 26న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతల్లో ఒక్కరైన శ్రీనివాస్ అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement