కంట్రోల్‌ తప్పితే...

Tiger Zinda Hai: Katrina Kaif’s workout video shows she is Salman Khan’s perfect foil - Sakshi

... దూసుకెళ్లారు కత్రినా కైఫ్‌. ఏ రేసులో పాల్గొంది అనుకుంటున్నారా? దూసుకెళ్లింది రేసులో కాదండి బాబు. తను నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ జిందా హై’ షూటింగ్‌లో. ఇదో హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీ అని మనకు తెలిసిన విషయమే. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో వచ్చే కార్‌ చేజ్‌ సీక్వెన్స్‌లో భాగంగా కారు తను చెప్పిన మాట వినలేదట. అదేనండీ కంట్రోల్‌ అవ్వలేదట.

చివరకు కార్‌ను తీసుకెళ్ళి ఓ గోడకు ఢీ కొట్టారట కత్రినా. ‘‘సినిమా ముందర కొద్దిగా శిక్షణ తీసు కున్నప్పటికీ మొరాకోలోని చిన్న వీధులు నన్ను కన్ఫ్యూజ్‌ చేసేశాయి. నేను కారుని గోడకు ఢీ కొట్టాక.. మా టీమ్‌ నాకు ఏమైందో అని కంగారు పడకుండా నా కారుకు తగిలించిన ఎక్స్‌పెన్సివ్‌  కెమెరాకు ఏమైందో అని కంగారుపడ్డారు’’ అని నవ్వేశారు కైఫ్‌. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. 

Back to Top