అదిరిపోయేలా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ ట్రైలర్‌..! | Thugs of Hindostan trailer released | Sakshi
Sakshi News home page

Sep 27 2018 12:51 PM | Updated on Sep 27 2018 3:32 PM

Thugs of Hindostan trailer released - Sakshi

సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. ఆమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కైత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షైక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్‌కృష్ణ ఆచార్య తెరకెక్కించారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను.. ప్రఖ్యాత ఫిల్మ్‌మేకర్‌ యశ్‌ చోప్రా జయంతి సందర్భంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి యాక్షన్‌ ప్యాకెడ్‌ పిరియడ్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది.

1795లో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరిట భారత్‌లోకి ప్రవేశించి.. ఆ తర్వాత అధికారం చెలాయించేందుకు తెగబడుతున్న నేపథ్యంలో ఆంగ్లేయులను ఒక థగ్స్‌ (బందీపోటు) ముఠా ఎలా ఎదుర్కొంది? అన్నది సినిమా ఇతివృత్తంగా కనిపిస్తుండగా.. థగ్స్‌ ముఠా అధిపతి ఆజాద్‌గా అమితాబ్‌.. థగ్స్‌ను దెబ్బతీసేందుకు బ్రిటిషర్లతో చేతులు కలిపి.. నమ్మకద్రోహం చేసే ఫిరంగిగా ఒకింత కామెడీ తరహా పాత్రలో ఆమిర్‌ కనిపించనున్నారు.  యాక్షన్‌  స్టంట్స్‌తో ఫాతిమా ట్రైలర్‌లో కనిపించగా..  కత్రినా తన అందాలతో మెరుపులు మెరిపించింది. మొత్తానికి ట్రైలర్‌ అదిరిపోయేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లోనూ ట్రైలర్‌ విడుదల చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్లు ఇక్కడ చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement