తెలుగులో అమితాబ్‌, ఆమిర్‌..! | Thugs of Hindostan To Be Dubbed In Tamil and Telugu | Sakshi
Sakshi News home page

Sep 26 2018 12:24 PM | Updated on Sep 26 2018 12:49 PM

Thugs of Hindostan To Be Dubbed In Tamil and Telugu - Sakshi

తొలిసారిగా బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ కలిసి నటిస్తున్న సినిమా  థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌. యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధూమ్‌ 3 ఫేం విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకుడు. కన్ఫెషన్స్‌ ఆఫ్‌ థగ్స్‌ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్‌ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా వినూత్నంగా ప్రారంభించారు. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఆమిర్‌ ఖాన్ స్వయంగా తెలుగులో మాట్లాడుతూ తమ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రిలీజ్‌ అవుతుందని తెలిపారు. హిందీ వర్షన్‌ తో పాటు నవంబర్‌ 8న తెలుగు, తమిళ భాషల్లోనే ఒకేసారి రిలీజ్ అవుతోంది థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement