ఆమిర్‌, అమితాబ్‌లు సహాయం చేయాలి!

Theatre Owners Demanding Makers To Refund For Thugs Of Hindostan - Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, మిష్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ లాంటి భారీ తారాగణంతో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ దీపావళికి విడుదలైన ఈ చిత్రం ఘోరపరాజయాన్ని చవిచూసింది. బాలీవుడ్‌ చరిత్రలో ఇలాంటి ఫెయిల్యూర్‌ను చూడాలేదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం హైబడ్జెట్‌ అంటూ సినిమాకు ఎక్కడ లేని హైప్‌ను తీసుకొచ్చారు మేకర్స్‌. 

దీనికి తోడు అమిర్‌, అమితాబ్‌, కత్రినా లాంటి స్టార్లు నటించేసరికి ఈ సినిమాపై అందరూ ఆశలు పెంచుకున్నారు. దాదాపు 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని అందరూ ఎగబడికొన్నారు. కానీ తీరా ఫలితం చూస్తే వారి గుండె పగిలేంత పనైంది. మొదటి రోజు ఓపెన్సింగ్‌ దృష్ట్యా రికార్డు క్రియేట్‌ చేసినా.. అసలు ఆట తరువాత మొదలైంది. రెండో రోజు నుంచి ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. 

వంద కోట్లు దాటడానికి వారం రోజులు పట్టింది. ఇప్పటికీ ఈ చిత్రం 150కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్స్‌ యజమానులకు లాభం కాదు కదా.. కొన్నదాంట్లో సగం కూడా వెనక్కివచ్చే పరిస్థితిలేదని వాపోతున్నారు. అయితే ఈ విషయంపై తమకు సహాయం చేయాలని యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ను డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అమితాబ్‌, ఆమిర్‌లు కూడా ఈ విషయంలో కలగజేసుకుని సహాయం చేయాలని కోరారు. 

గతంలో కొందరు హీరోలు ఇలా తమ సినిమాలు ఊహించని పరాజయం ఎదురైనప్పుడు వారిని ఆదుకున్నారు. ‘జబ్‌ హ్యారి మెట్‌ సజల్‌’, ‘దిల్‌వాలే’ సినిమాల విషయంలో షారుఖ్‌ ఖాన్‌, ‘ట్యూబ్‌లైట్‌’ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ ఆదుకున్నారు. ఇంత నష్టాల్లో ఈ సినిమాను నడిపించలేమంటూ థియేటర్స్‌ యజమానులు తేల్చిచెప్పారు.  మరి ఈ విషయంలో నిర్మాతలు, హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top