టాప్ హీరోయిన్లు నాతో పని చేయడం లేదు:సన్నీడియోల్ | The top heroines turn me down: Sunny Deol | Sakshi
Sakshi News home page

టాప్ హీరోయిన్లు నాతో పని చేయడం లేదు:సన్నీడియోల్

Nov 26 2013 2:55 PM | Updated on Apr 3 2019 6:23 PM

టాప్ హీరోయిన్లు తనతో పని చేయడానికి ఇష్టపడటం లేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ తెలిపాడు.

ముంబై: టాప్ హీరోయిన్లు తనతో పని చేయడానికి ఇష్టపడటం లేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ తెలిపాడు. బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నసన్నీ తాజాగా నటించిన 'సింగ్ సాబ్ ద గ్రేట్' త్వరలో విడుదల కానుంది. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 50 ఏళ్ల పైబడిన  తనతో 19 ఏళ్ల ఉర్వశీ రౌతేలా జోడి కట్టిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. పెద్ద హీరోయిన్లతో సినిమా చేయడానికి ఆసక్తి ఉన్నా వారు మాత్రం అయిష్టత చూపిస్తున్నారన్నాడు.

 

తాను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నానని తెలిపాడు. ఇంకా తన గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.  1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన సన్నీ..ఆపై దర్శకుడిగా కూడా మరాడు. ఈ  30 ఏళ్ల బాలీవుడ్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను చూశానని  తెలిపాడు.ప్రస్తుతం తాను తిరిగి ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ క్రమంలో కొత్త నటీమణుల కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు.

 

కొత్త వారి డేట్లు దొరకబుచ్చకోవడం కూడా పెద్ద కష్టం కాదన్నాడు.  తనతో పని చేయమని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు కలిశాన్నాడు. కాగా, వారు మాత్రం తనతో పనిచేయడానికి ఆసక్తి కనబరచడం లేదన్నాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్లతో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement