ప్రశాంతంగా గడపాలి | The Proust Questionnaire with Hansika Motwani | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా గడపాలి

Apr 27 2016 3:14 AM | Updated on Oct 17 2018 4:36 PM

ప్రశాంతంగా గడపాలి - Sakshi

ప్రశాంతంగా గడపాలి

ప్రశాంతంగా జీవితం గడపాలనేదే తన ఆశని నటి హన్సిక తెలిపారు. త్రిష, నయనతారకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడడంతో హన్సిక,

 టీనగర్: ప్రశాంతంగా జీవితం గడపాలనేదే తన ఆశని నటి హన్సిక తెలిపారు. త్రిష, నయనతారకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడడంతో హన్సిక, కాజల్ అగర్వాల్ వంటి తారలకు చిత్ర అవకాశాలు తక్కువయ్యాయి. హన్సిక తమిళంలో నటించిన ‘ఉయిరే ఉయిరే’ చిత్రం ఇటీవల విడుదలయింది. ఆ తర్వాత మణిదన్, భోగన్ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా చిత్రాల్లేవు. కొత్త చిత్రాలను అంగీకరించేందుకు స్క్రిప్ట్‌లు వింటున్నారు. తాను నటిని కాకుంటే డాక్టర్ అయి ఉండేదాన్నని ఆమె తరచూ అంటుండేవారు.
 
 ఆమె తల్లి కూడా డాక్టర్ అనేది గమనార్హం. హన్సికకు తరచుగా న్యూయార్క్‌కు టూర్ వెళ్లడం, అక్కడే నెల రోజులు వరకు గడపడం ఇష్టం. న్యూయార్క్‌పై ఆమెకున్న ప్రేమే ఈ పయనానికి కారణమట. ఇటీవల తన ఇష్టాయిష్టాల గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక ఒక ప్రశ్నకు బదులిస్తూ వందేళ్ల వరకు బతుకుతాననే నమ్మకం ఉందని, నిద్రించే సమయంలో నెమ్మదిగా నిద్రించాలని, ప్రశాంతంగా జీవితం గడపాలనేదే తన ఆశని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement