రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్ | Tharun Bhascker Meets Sanju Director Rajkumar Hirani | Sakshi
Sakshi News home page

Jul 4 2018 10:10 AM | Updated on Jul 4 2018 11:07 AM

Tharun Bhascker Meets Sanju Director Rajkumar Hirani - Sakshi

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్‌ అయిన రాజ్‌ కుమార్‌ హిరాణి ‘సంజు’, తరుణ్‌ భాస్కర్‌ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట.

సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ఆధారంగా రాజ్‌ కుమార్‌ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్‌ అయి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement