ఆగిన షూటింగ్ | thala ajith "veeram" movie stopped | Sakshi
Sakshi News home page

ఆగిన షూటింగ్

Oct 25 2013 4:18 AM | Updated on Sep 1 2017 11:56 PM

ఆగిన షూటింగ్

ఆగిన షూటింగ్

ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యం గా అడ్డుకోవడంతో అజిత్ చిత్రం షూటింగ్ ఆగింది. అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వీరం.

ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యం గా అడ్డుకోవడంతో అజిత్ చిత్రం షూటింగ్ ఆగింది. అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వీరం. తమన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరుతై ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అక్కడ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చారు. 
 
 నిబంధనల ప్రకారం లోకల్ స్టంట్ కళాకారులకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. వారికి చిత్ర దర్శకుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి సమస్య జటిలమైంది. దీంతో షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. పోరాట దృశ్యాల చిత్రీకరణను నిలిపి వేసి అజిత్, తమన్నపై సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement