సింబా స్టార్ట్‌

Temper Remake Shooting in Hyderabad - Sakshi

ముంబై టెంపర్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. ఇందుకోసం ఆల్మోస్ట్‌ టు మంత్స్‌ ఇక్కడే పాగా వేస్తారు. ‘గోల్‌మాల్‌ అండ్‌ సింగమ్‌ ఫ్రాంచైజీ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ వంటి హిట్‌ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్‌శెట్టి నేతృత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింబా’. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. రెండు నెలల పాటు కంటిన్యూస్‌గా ఇక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. ఇందులో అజయ్‌ దేవగన్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తారని బీటౌన్‌ ఖబర్‌. ‘సింబా’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రబృందం అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top