ఆ సినిమాల్లా హిట్‌ అవుతుంది | Taxiwaala Movie Release Press Meet | Sakshi
Sakshi News home page

ఆ సినిమాల్లా హిట్‌ అవుతుంది

Nov 17 2018 3:29 AM | Updated on Nov 17 2018 3:29 AM

Taxiwaala Movie Release Press Meet - Sakshi

రాహుల్, మాళవిక, ప్రియాంక, ఎస్‌.కె.ఎన్‌

‘‘ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీని తీసుకుని రాహుల్‌ ‘టాక్సీవాలా’ తెరకెక్కించారు. తను చెప్పిన కథ అల్లుఅరవింద్‌గారికి, బన్నీగారికి, నాకు బాగా నచ్చి ఓకే చేశాము. ప్రస్తుతం అన్ని భాషల్లో కాన్సెప్ట్‌ చిత్రాలు వస్తున్నాయి. అదేకోవలో మా సినిమా తెరకెక్కింది’’ అని నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ సినిమాల్లా ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా చిత్రం పైరసీ చూసిన వారంతా మళ్లీ థియేటర్‌కి వెళ్లి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభూతి వస్తుంది’’ అన్నారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని రాహుల్‌ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేశా’’ అన్నారు మళవికా నాయర్‌. ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది’’ అని ప్రియాంక జవాల్కర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement