తొలి తరం టార్జాన్ స్టార్ మృతి | 'Tarzan' star Denny Miller dies | Sakshi
Sakshi News home page

తొలి తరం టార్జాన్ స్టార్ మృతి

Sep 13 2014 3:10 PM | Updated on Sep 2 2017 1:19 PM

తొలి తరం టార్జాన్ స్టార్ మృతి

తొలి తరం టార్జాన్ స్టార్ మృతి

వెండితెర మీద టార్జాన్గా తొలిసారి నటించిన హాలీవుడ్ నటుడు డెన్నీ మిల్లర్ (80) మరణించారు.

వెండితెర మీద టార్జాన్గా తొలిసారి నటించిన హాలీవుడ్ నటుడు డెన్నీ మిల్లర్ (80) మరణించారు. ఆయనకు లూ గెరిగ్ వ్యాధి ఉన్నట్లు జనవరిలో గుర్తించారు. చికిత్స చేసినా ఉపయోగం లేకపోవడంతో లాస్ వెగాస్లో మరణించినట్లు ఆయన ఏజెంటు డేవిడ్ మాస్ తెలిపారు.

6 అడుగుల 4 అంగుళాల ఎత్తుండే మిల్లర్.. తొలుత యూసీఎల్ఏ టీం కోసం బాస్కెట్ బాల్ ఆడేవారు. బ్లేక్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వచ్చిన 'ద పార్టీ' చిత్రంలో కూడా ఆయన నటించారు. 1959లో వచ్చిన టార్జాన్.. ద ఏప్ మ్యాన్ సినిమాలో మిల్లర్ టార్జాన్గా నటించారు. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో తన భారీ పర్సనాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement