నటి ఫొటోలు లీక్‌; అతడికి సంబంధం లేదు! | Tanuj Virwani Spokesperson On Akshara Haasan Photo Leak Case | Sakshi
Sakshi News home page

నటి ఫొటోలు లీక్‌; తనకు సంబంధం లేదు!

Nov 16 2018 5:13 PM | Updated on Nov 16 2018 5:27 PM

Tanuj Virwani Spokesperson On Akshara Haasan Photo Leak Case - Sakshi

ఆమె పరువును బజారుకు ఈడ్చాలని చూసిన వారెవరైనా వదిలిపెట్టవద్దు.

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె, నటి అక్షరాహాసన్‌ పర్సనల్‌ ఫొటోలు ఇటీవల లీక్‌ అయిన సంగతి తెలిసిందే. తన మాజీ ప్రియుడు తనూజ్‌ విర్వానీతో గతంలో దిగిన ఫొటోలను ఆమె ఫోన్‌లో నుంచి అజ్ఞాత వ్యక్తి హ్యాక్‌ చేసి ఇంటర్‌నెట్‌లోకి వదిలాడు. ఈ విషయమై అక్షర ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ క్రమంలో... 2013లో తనూజ్‌తో అక్షర షేర్‌ చేసుకున్న ఫొటోలు హ్యాక్‌కు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా తనూజ్‌ని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ వార్తలపై తనూజ్‌ మేనేజర్‌ స్పందించాడు. అక్షర ఫొటోల లీక్‌తో తనూజ్‌కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. ఆమె పరువును బజారుకు ఈడ్చాలని చూసిన వారెవరైనా వదిలిపెట్టవద్దని, అందుకోసం తనూజ్‌ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపాడు. కాగా బాలీవుడ్‌ నటి రతి అగ్రిహోత్రి తనయుడు తనూజ్‌ విర్వానీ, అక్షర చాలా ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోయిన ఈ జంట ప్రస్తుతం స్నేహితులుగా మెలుగుతున్నారని అతడి మేనేజర్‌ పేర్కొన్నాడు.

@mumbaipolice @cybercrime_cell

A post shared by Akshara Haasan (@aksharaa.haasan) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement