అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. ! | Tamil Hero Ajith Participate In Shooting Championship | Sakshi
Sakshi News home page

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

Jul 30 2019 4:57 PM | Updated on Jul 30 2019 5:46 PM

Tamil Hero Ajith Participate In Shooting Championship - Sakshi

కోలీవుడ్‌ విలక్షణ హీరో అజిత్‌కు నటనతో పాటు పలు రంగాల్లో ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. అజిత్‌కు చిన్నతనం నుంచి ఏరో మోడలింగ్‌లో ప్రతిభ ఉంది. ఇటీవలె అజిత్‌ను ‘హెలికాప్టర్ టెస్ట్‌ పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి’గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ నిరాయుధ వైమానిక వాహన ప్రయోగ పోటీల్లో అయన పాల్గొనవచ్చు. దీంతో పాటు అజిత్‌కు ఫోటోగ్రఫీ, కారు రేసింగ్‌ రంగాల్లో కూడా ప్రావీణ్యం ఉంది. కారు రేసింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నారు.

అయితే రీసెంట్‌గా అజిత్‌ షూటింగ్‌ చేస్తూ కనిపించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గత కొన్ని నెలల కింద కొయంబత్తుర్‌లో నిర్వహించిన తమిళనాడు రాష్ట్ర 45వ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అజిత్‌ పాల్గొన్నాడు. అజిత్‌ తదుపరి చిత్రం ‘నెర్కొండ పార్వై’ అగస్టు 8న పేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement