అప్పుడు నరసింహతో ఇప్పుడు నరసింహనాయుడుతో

అప్పుడు నరసింహతో ఇప్పుడు నరసింహనాయుడుతో - Sakshi


రజనీకాంత్‌తో ‘నా దారి రహదారి’ అని ‘నరసింహ’లో డైలాగ్‌ చెప్పించిన తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ అదే హీరోలోని మాస్‌ హీరోయిజాన్ని ‘ముత్తు’లో ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేశారు. ఇప్పుడాయన ‘కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా’ వంటి పవర్‌ఫుల్‌ డైలాగులకు, మాస్‌ హీరోయిజానికి పెట్టింది పేరైన మన ‘నరసింహనాయుడు’ బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణను కేఎస్‌ రవికుమార్‌ ఏ దారిలో తీసుకువెళతారో... కత్తి పట్టిస్తారా? లేదా మరోదారిలో అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమా తీస్తారా? వెయిట్‌ అండ్‌ సీ! ‘‘ఎం. రత్నం కథ, మాటలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జూలై 10న సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అన్నారు చిత్రనిర్మాత సి. కల్యాణ్‌.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top