పెళ్లికి బాజా మోగిందా?

tamil actor arya, sayesha saigal wedding rumours - Sakshi

‘అఖిల్‌’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సయేషా. తెలుగులో జోరుగా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్నారు. వరుసగా యంగ్‌ హీరోలతో జతకడుతూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ఈ మధ్య మరో వార్త ద్వారా హాట్‌ టాపిక్‌గా మారారు సయేషా. తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకోనున్నారన్నదే ఆ టాపిక్‌. రీసెంట్‌గా ‘గజినీకాంత్‌’ అనే సినిమాలో ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.

ఆ షూటింగ్‌లో ఏర్పడిన అనుబంధమే ఈ ఇద్దరూ కలిసి ఏడడుగులు నడవాలనే నిర్ణయానికి కారణం అయిందని టాక్‌.  ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న ‘కాప్పాన్‌’ సినిమాలోనూ ఆర్య, సయేషా నటిస్తున్నారు. అయితే జోడీగా కాదు. ఈ సినిమా షూటింగ్‌ బ్రేక్స్‌లో చెన్నైలో ఏ మాల్‌లో చూసినా వీళ్లిద్దరే కనబడటంతో ‘సమ్‌థింగ్‌’ ఉంది అనే వార్త బలం అందుకుంది. ఇరు కుటుంబ సభ్యులు కూడా తమ అంగీకారాలను తెలిపినట్టు కోలీవుడ్‌ టాక్‌. మరి పెళ్లికి బాజా మోగిందా? అంటే వేచి చూద్దాం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top