పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా! | Tamannaah Bhatia Says She is Not Getting Married | Sakshi
Sakshi News home page

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా!

Apr 19 2016 7:43 PM | Updated on Apr 3 2019 6:34 PM

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా! - Sakshi

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా!

తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు గుప్పుమన్న వార్తలపై టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది.

తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు గుప్పుమన్న వార్తలపై టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. అవన్ని వదంతులని, తానెవరినీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సినీ వృత్తిజీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నానని చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినప్పుడు తప్పకుండా ప్రపంచానికి తెలియజేస్తానని వెల్లడించింది.

తమన్నా కంప్యూటర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోబోతున్నదని, పెళ్లి తర్వాత ఆమె నటనకు గుడ్‌బై చెప్పే అవకాశముందని ఒక్కసారిగా కథనాలు వచ్చాయి. ఈ వదంతులు సినీ పరిశ్రమలో హల్‌చల్ సృష్టించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తమన్నా భాటియా 'ఇవి తప్పుడు కథనాలు. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ విషయం మొదట ప్రపంచానికి చెప్తాను. ప్రభుదేవా సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నాను' అని తమన్నా ఓ ప్రకటనలో తెలిపింది.

తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా 'బాహుబలి' సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజాగా నటించిన 'ఊపిరి' సినిమా కూడా మంచి మార్కులే తెచ్చిపెట్టింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్ సరసన ఓ చిత్రంలో నటించనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement