‘కరీనా మేకప్‌ వేసుకుంటే వాడికి నచ్చదు’

Taimur Ali Khan Did Not Like When Her Mom Kareena Kapoor Khan Dons A Different Look - Sakshi

కరీనా మేకప్‌ వేసుకుంటే ఆమె ముద్దుల కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు నచ్చదట. కానీ తాను ఎలాంటి గెటప్‌లో ఉన్నా పెద్దగా పటించుకోడు అంటున్నారు సైఫ్‌ అలీ ఖాన్‌.‌ ప్రస్తుతం ఆయన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘సేక్రెడ్‌ గేమ్స్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సిక్కు పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సైఫ్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సేక్రెడ్‌ గేమ్స్‌లో రెండో సీజన్‌ షూటింగ్‌ ముంబయిలో జరుగుతుంది. ఓ రోజు ఈ షూటింగ్‌ సెట్‌కు తైమూర్‌ వచ్చాడు. అప్పుడు నేను టర్బన్‌, బ్యాండేజ్‌తో ఉన్నాను. నన్ను అలా చూసి వాడు (తైమూర్‌) ఏం బాధపడలేదు. మరోసారి నేను నవదీప్‌ సింగ్‌ సినిమా ‘హంటర్‌’లో సాధువు పాత్రలో నటిస్తున్నప్పుడు  ఆ సెట్‌కు వచ్చాడు. అప్పుడు నేను గెడ్డం, జుట్టుతో ఉన్నా వాడిలో ఏ మాత్రం స్పందన లేదు’ అన్నారు

‘కానీ వాళ్ల అమ్మ సాధారణంగా కాకుండా కొత్త గెటప్‌లో కనిపిస్తే మాత్రం వాడు ఊరుకోడు. వాళ్లమ్మ మేకప్‌ వేసుకుంటే వాడికి అస్సలు నచ్చదు’ అంటూ చెప్పుకొచ్చారు సైఫ్‌. ఇటీవల కరీనా ఓ షోలో మాట్లాడుతూ.. ‘తైమూర్‌ను వదిలి వెళ్లాడానికి సైఫ్‌ చాలా కష్టపడుతుంటాడు. షూటింగ్‌కు వెళ్లమంటే ‘లేదు ఈ రోజు షూట్‌ క్యాన్సల్‌ చేస్తాను. వెళ్లను’ అంటాడు. అప్పుడే నేను ‘నువ్వు వెళ్లాల్సిందే’ అని చెప్పి బలవంతంగా బయటికి నెడతాను. సైఫ్‌కు తైమూర్‌తో కలిసి సమయం గడపడం చాలా ఇష్టం’ అన్నారు కరీనా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top