బేగమ్ హజ్రత్... భేష్! | Tabu's ravishing first look as the Begum from 'Fitoor' | Sakshi
Sakshi News home page

బేగమ్ హజ్రత్... భేష్!

Jan 3 2016 11:44 PM | Updated on Sep 3 2017 3:01 PM

బేగమ్ హజ్రత్... భేష్!

బేగమ్ హజ్రత్... భేష్!

వంకీలు తిరిగిన ఎర్రటి రంగు జుత్తుతో గమ్మత్తుగా కనిపిస్తున్న టబు లుక్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

వంకీలు తిరిగిన ఎర్రటి రంగు జుత్తుతో గమ్మత్తుగా కనిపిస్తున్న టబు లుక్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించిన టబు ‘హైదర్’ సినిమా పుణ్యమా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా హిందీ దర్శక-నిర్మాతలకు కొత్త ఛాయిస్ అయ్యారు. కథలో ప్రాధాన్యం ఉన్న సహాయ నటి పాత్రలంటే టబూనే చేయాలని అక్కడివారు ఫిక్స్ అయిపోయారు.

 చివరికి ‘ఫితూర్’లో అందాల అభినేత్రి రేఖని తీసుకున్న పాత్రకు టబూని రీప్లేస్ చేశారంటే.. ఈ పొడుగు కాళ్ల సుందరికి హిందీలో ఉన్న డిమాండ్ ఏంటో ఊహించుకోవచ్చు. అదే ‘బేగమ్ హజ్రత్’ పాత్ర. ఈ పాత్రను రేఖ వదులుకోవడం టబు అదృష్టం అని హిందీ రంగంలో అందరూ అంటున్నారు. ముఖ్యంగా టబు లుక్ విడుదలయ్యాక మంచి పాత్ర కొట్టేశారనీ, ‘బేగమ్ హజ్రత్’గా ఆమె లుక్ భే్‌ష్ అని కితాబులిచ్చేస్తున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆదిత్యా రాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రఖ్యాత ఆంగ్ల నవల ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ ఆధారంగా తెరకెక్కుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement