వీరనారిగా...

tabu joined in Sye Raa Narasimha Reddy  movie - Sakshi

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ స్టార్‌ క్యాస్ట్‌తో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో స్క్రీన్‌ అంతా ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా మారనుడటం పక్కా. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్‌ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కనిపించనున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి రూపొందిస్తున్న పీరియాడికల్‌ మూవీ ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓ ముఖ్య ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ కూడా ఉన్నారట.

దాంతో ఈ పాత్రకు టబును సెలెక్ట్‌ చేసుకున్నారట చిత్ర బృందం. పదేళ్ల గ్యాప్‌ తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.  రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు,  సుదీప్, విజయ్‌ సేతుపతిలతో నిండిపోయిన ఈ పీరియాడికల్‌ మూవీలో టబు కూడా జాయిన్‌ అవ్వడం కచ్చితంగా ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్‌ త్రివేది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top