నాగ్‌ సరసన సీనియర్‌ బ్యూటీ | Tabu to act with Nagarjuna in Ram Gopal Varma Movie | Sakshi
Sakshi News home page

నాగ్‌ సరసన సీనియర్‌ బ్యూటీ

Nov 2 2017 12:33 PM | Updated on Jul 15 2019 9:21 PM

Tabu to act with Nagarjuna in Ram Gopal Varma Movie - Sakshi

కింగ్‌ నాగార్జున, బాలీవుడ్‌ బ్యూటీ టబులది సూపర్‌ హిట్‌ పెయిర్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నిన్నేపెళ్లాడతా.. ఆవిడా మా ఆవిడే సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కేవలం నాగ్‌ తో ఉన్న స్నేహం కారణంగా హీరోయిన్‌ గా మాంచి ఫాంలో ఉన్న సమయంలో సిసింద్రీ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది టబు. కేవలం​ హీరో హీరోయిన్లుగా మాత్రమే కాదు.. నాగ్‌ టబుల మధ‍్య మంచి స్నేహం కూడా ఉంది.  నాగ్‌ ఫ్యామిలీతో నాకు ఎంతో అనుబంధం ఉందంటూ టబు చాలా సార్లు చెప్పింది.

ఇప్పుడు ఈ ఇంట్రస్టింగ్‌ పెయిర్‌ ను మరో సారి తెరమీద చూపించేందుకు రెడీ అవుతున్నాడు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. నాగార్జున హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ నెల 20న సినిమా ప్రారంభించనున్నారు. అప్పట్లో శివ సినిమాను ప్రారంభించిన అదే ప్లేస్‌ లో కొత్త సినిమా స్టార్ట్‌ చేయనున్నారు. పోలీస్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా టబు నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి నిజంగానే నాగ్‌ టబుతో జోడి కడతాడా లేదా తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌ మెంట్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement