భయమే బాధ్యత | Taapsee Pannu's next Tamil film titled Game Over | Sakshi
Sakshi News home page

భయమే బాధ్యత

Oct 16 2018 12:55 AM | Updated on Oct 16 2018 12:55 AM

Taapsee Pannu's next Tamil film titled Game Over - Sakshi

తాప్సీ

ఏదైనా సులువుగా వస్తే దాని విలువ మనకు తెలియదంటారు. అలాగే.. జర్నీ సులువుగా సాగినా కిక్‌ ఉండదు అంటున్నారు తాప్సీ. ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రయాణం సులువు అవ్వలేదు. సులువుగా ఉండకూడదు కూడా. ఒక్కసారి అన్ని పనులు మనం కష్టపడకుండా వస్తే మనల్ని మనం గొప్పగా భావించడం మొదలుపెడతాం. ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు.

ఇవాళ అభిమానులు పంచే ప్రేమ రేపు వేరే వాళ్ల పళ్లెంలోకి వెళ్లిపోవచ్చు. స్థిరత్వం అనేది ఉండని ఫీల్డ్‌ చిత్ర పరిశ్రమ. ఇది బావుంది కదా అని రిలాక్స్‌ కూడా అవ్వకూడదు. నా పాత సినిమాను ప్రేమించారు కదా చాలులే అనుకుంటే అక్కడే ఆగిపోతావు. అలా ఉండకుండా ప్రతి క్షణం భయం ఎంతో కొంత ఉంటుంది. ఆ భయమే బాధ్యత తీసుకొస్తుంది. ఎత్తుకు తీసుకువెళ్తుంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఆమె ‘గేమ్‌ ఓవర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement