దిగ్గజ నటుడి తప్పిదం | Sylvester Stallone Wrong post on Salman Race 3 Movie | Sakshi
Sakshi News home page

Mar 22 2018 3:09 PM | Updated on Mar 22 2018 5:59 PM

Sylvester Stallone Wrong post on Salman Race 3 Movie - Sakshi

సిల్వెస్టర్‌ స్టాల్లోన్‌ (పాత చిత్రం)

సాక్షి, సినిమా : సోషల్‌ మీడియాలో చేసే పోస్ట్‌లు ఆచీ తూచీ చేయకపోతే.. ట్రోలింగ్‌ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. సరిగ్గా హాలీవుడ్‌ దిగ్గజం సిల్వెస్టర్‌ స్టాలోన్‌(71)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. 

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన రేస్‌-3 చిత్రానికి సంబంధించి ఈ మధ్య వరుసగా లుక్కులతో పోస్టర్లను వదులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలోన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో చిత్రంలో మరో పాత్రధారి బాబీ డియోల్‌ ఫోటోను షేర్‌ చేసి టాలెంటెడ్‌ హీరో సల్మాన్‌కు ఖాన్‌కు బెస్ట్‌ విషెస్‌ అంటూ సందేశం ఉంచాడు. 

అంతే ఇక ట్రోలింగ్‌ బాబులు వాళ్ల పనితనం చూపిస్తూ ఈ సీనియర్‌ హీరోను ఎగతాళి చేస్తున్నారు. చిత్రానికి ప్రమోషన్‌ చేస్తే చేశారుగానీ.. ఇలా కనీస పరిజ్ఞానం లేకుండా పోస్ట్‌ ఎలా చేస్తారంటూ ఏకీపడేస్తున్నారు. కోట్లాది అభిమానులు ఉన్న సల్మాన్‌ ఎవరో స్టాల్లోన్‌కు తెలీదా? అంటూ కొందరు.. కనీసం సల్మాన్‌ పోస్ట్‌ చేసిన ఫోటో చూసైనా స్టాల్లోన్‌ ఫోటో పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ మరికొందరు సలహాలిస్తున్నారు. ఏదిఏమైనా స్టాలోన్‌ ఇప్పటిదాకా ఆ పోస్ట్‌ను మాత్రం డిలీట్‌ చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement