‘సైరా’ నుంచి మరో ఆకట్టుకునే పోస్టర్‌ | Sye Raa Movie Team Released A Special Poster On Kiccha Sudeep Birthday | Sakshi
Sakshi News home page

Sep 1 2018 6:54 PM | Updated on Sep 1 2018 7:09 PM

Sye Raa Movie Team Released A Special Poster On Kiccha Sudeep Birthday - Sakshi

‘హ్యాపీ బర్త్‌ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్‌ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్‌..

తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్‌ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్‌ ఓ స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్‌ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్‌ స్టిల్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement