ఏపీలో ‘సైరా’ అదనపు షోలు | Sye Raa Gets Permission To Additional Shows | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు

Oct 1 2019 9:46 PM | Updated on Oct 2 2019 1:43 PM

Sye Raa Gets Permission To Additional Shows - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్‌ షోలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్‌ షో లకు అనుమతిస్తున్నట్టు జీవోలో పేర్కొంది.

కాగా, మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సైరాను నిర్మించారు.

చదవండి : ‘సైరా’పై మోహన్‌బాబు స్పందన..
                    సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement