ఆంటీ వివాదంపై నటి వివరణ

Swara Bhasker Responds On Aunty Controversy - Sakshi

ముంబై : తనను ఆంటీ అన్నందుకు నాలుగేళ్ల చిన్నారిని అకారణంగా దూషించిన నటి స్వర భాస్కర్‌ తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తాను జోక్‌గానే బాలుడిని దుర్భాషలాడినట్టు కామెడీ షోలో చెప్పానని, తానెన్నడూ చిన్నారులను, సహ నటులను దూషించలేదని అన్నారు. స్వర ఇటీవల ఓ కామెడీ టాక్‌ షోలో మాట్లాడుతూ తాను పాల్గొన్న తొలి షూటింగ్‌లో తనను ఆంటీ అని పిలిచిన చిన్నారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డానని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. స్వర తీరుపై నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు.

బాలుడిని దుర్బాషలాడి నిజంగానే ఆంటీ అనిపించుకున్నావని దుయ్యబట్టారు. స్వర ఆంటీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేశారు. తాను కామెడీ షోలో పాల్గొంటూ సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నానని, వ్యంగ్యంగా ఆ ఘటన గురించి చెప్పే క్రమంలో ఆ భాష వాడాల్సి వచ్చిందని..అది కూడా హాస్య ధోరణిలో ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. తాను జోక్‌గా చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారని చెప్పుకొచ్చారు. కాగా బాలుడిని దుర్భాషలాడటంపై స్వర భాస్కర్‌ తీరును తప్పుపడుతూ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం అనే ఎన్జీవో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఆమెపై ఫిర్యాదు చేసింది. స్వర భాస్కర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది.

చదవండి : ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top