ఆ నటిని నిజంగానే ఆంటీని చేశారు!

Swara Bhaskar Gets Trolled For Abusing A Child - Sakshi

బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ విమర్శలపాలైంది. ‘సన్‌ ఆఫ్‌ అభిష్’ అనే షోలో ఆమె చేసిన వివాదాస్పదవ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయి. ఈ షోలో ఆమె మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలో యాడ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘యాడ్‌ షూట్‌ చేసే సమయంలో నాలుగేళ్ల బాలుడు నన్ను ఆంటీ అని పిలిచాడు. ఇది నాకెంతో చిరాకు తెప్పించింది. ఎవరికైనా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు కదా. ఆంటీ అనగానే నేను కోపంతో చెడామడా తిట్టేశాను. అసలు వీళ్లు చిన్నపిల్లలా లేక దెయ్యాలా’ అని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఆమె మాటలు షోలో నవ్వు తెప్పించాయి కానీ సోషల్‌ మీడియాలో మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. బాలీవుడ్‌ నటి చిన్నపిల్లలను తిట్టడం కామెడీనా? నాలుగేళ్ల పిల్లోడిని బూతులు తిడతావా? అంటూ స్వరభాస్కర్‌ను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పుడు కాదు.. ఇప్పుడు నిజంగానే నువ్వు ఆంటీ అయ్యావు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘#swara_aunty’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. జాతీయ చానల్‌లో చిన్నపిల్లలను తిట్టడం దారుణమంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను జాతీయ బాలల సంరక్షణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక నవంబర్‌ 5న టాప్‌ ట్రెండ్‌లో #swara_aunty ఒకటిగా నిలిచింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top