కంటెంట్‌ బావుంటే ఆదరిస్తున్నారు: పృథ్వీ

SVBC Chairman Prudhvi Raj Neethone Hai Hai Movie Audio Launch - Sakshi

కేయ‌స్ పి ప్రొడక్షన్స్ ప‌తాకంపై  డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్ తేజ్ , చ‌రిష్మా శ్రీక‌ర్ జంట‌గా  బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌, డా.ఏయ‌స్ కీర్తి, డా.జి.పార్థ సార‌ధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంఛ్‌ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్‌, నటుడు పృథ్వీ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్‌`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచితో చిత్రాన్ని నిర్మించారు.  హీరో , హీరోయిన్స్  మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది.  కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.  ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు’అన్నారు. ఆనంద్, బెన‌ర్జి, నారాయ‌ణ‌రావు, ఏడిద శ్రీరామ్, జ‌య‌చంద్ర‌, జ‌బ‌ర్ద‌స్త్ రాంప్ర‌సాద్, శ్రీ ప్రియ‌, శిరీష‌, కృష్ణ ప్రియ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి రవి కళ్యాణ్‌ సంగీతాన్ని అందించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top