లక్ష్మీస్‌ ఎన్టీఆర్.. కొనసాగుతున్న సస్పెన్స్‌ | Suspense Continuous on Lakshmis NTR Release Date | Sakshi
Sakshi News home page

లక్ష్మీస్‌ ఎన్టీఆర్.. కొనసాగుతున్న సస్పెన్స్‌

Mar 27 2019 4:44 PM | Updated on Mar 27 2019 4:44 PM

Suspense Continuous on Lakshmis NTR Release Date - Sakshi

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు సినిమా రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డ్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వటంతో ఇక రిలీజ్ కు లైన్‌క్లియర్‌ అని భావించారు అంతా. అయితే తాజాగా ఈ సినిమాపై మరో రెండు పిటీషన్లు వేశారు. సెన్సార్‌ బోర్డ్ అనుమతులపై పిటీషన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ దాఖలైంది.

ఈ రెండు పిటీషన్ల విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే దర్శక నిర్మాత రామ్‌ గోపాల్ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను శుక్రవారం రిలీజ్ చేస్తానంటున్నారు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ జోరు పెంచారు. తాజాగా సినిమాలో నేనేం చేశాను అంటూ సాగే మరో ఎమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ హాట్‌ టాపిక్‌గా మారటంతో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement