సిన్సియర్ సింహం! | surya singam 3 audio on December 16 | Sakshi
Sakshi News home page

సిన్సియర్ సింహం!

Nov 7 2016 12:06 AM | Updated on Sep 4 2017 7:23 PM

సిన్సియర్ సింహం!

సిన్సియర్ సింహం!

సింహం.. సిన్సియర్ పోలీసాఫీసర్ నరసింహం వచ్చేస్తున్నాడు. సింహ గర్జన ఎలా ఉంటుందో చెప్పడానికి సాంపిల్ అన్నట్టు నేడు టీజర్‌తో వచ్చేస్తున్నాడు.

సింహం.. సిన్సియర్ పోలీసాఫీసర్ నరసింహం వచ్చేస్తున్నాడు. సింహ గర్జన ఎలా ఉంటుందో చెప్పడానికి సాంపిల్ అన్నట్టు నేడు టీజర్‌తో వచ్చేస్తున్నాడు. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘సింగం-3’. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘సింగం’ ఫ్రాంచైజీలో ఈ మూడో సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నారు. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటల్ని ఈ నెలాఖరున, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని శివకుమార్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement