ఫోర్‌ గెటప్స్‌లో...

surya four getups in new movie - Sakshi

ఊహలకు, వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు సూర్య అండ్‌ టీమ్‌. సినిమాలో నిజంగా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని వెల్లడించారు. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఫైనల్లీ సాయేషాని తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే  మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ నటించనున్న ఈ సినిమాలో తాజాగా సముద్రఖని, బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ యూనిట్‌లో యాడ్‌ అయినట్లు కేవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బొమన్‌ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘నా నెక్ట్స్‌ సినిమాలో డైనమిక్‌ యాక్టర్‌ సూర్య సరసన నటించబోతున్నానని చెప్పడానికి ఆనందంగా ఉంది. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్, శిరీష్‌లతో నటించబోతున్నందకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు సాయేషా. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 25న లండన్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. అక్కడే ఓ పబ్‌ సాంగ్‌ను కూడా తీస్తారట. ఈ సినిమాలో సూర్య ఫోర్‌ గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top