రెస్ట్ అవసరం లేదంటున్న సింగం | Suriya New Movie Pooja held Today | Sakshi
Sakshi News home page

రెస్ట్ అవసరం లేదంటున్న సింగం

Nov 2 2016 3:30 PM | Updated on Sep 4 2017 6:59 PM

రెస్ట్ అవసరం లేదంటున్న సింగం

రెస్ట్ అవసరం లేదంటున్న సింగం

తమిళ నాట ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో సూర్య. క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే ఈ స్టార్ హీరో మేకింగ్ విషయంలో కూడా యమా స్పీడు...

తమిళ నాట ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో సూర్య. క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే ఈ స్టార్ హీరో మేకింగ్ విషయంలో కూడా యమా స్పీడు చూపిస్తుంటాడు. తన రేంజ్ హీరోలందరూ ఏడాది ఒక్క సినిమాతో సరిపెడుతుంటే సూర్య మాత్రం కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో సూపర్ హిట్ సీరీస్ గా నిలిచిన సింగం సీరీస్ లో మూడో భాగంలో హీరోగా నటిస్తున్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సింగం 3 షూటింగ్ తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను మొదలెట్టేశాడు సూర్య.

నానుమ్ రౌడీధాన్ సినిమా ఫేం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజే(బుధవారం) లాంఛనంగా ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈసినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement