సూర్య శూరుడు | suriya and sudha kongara new film soorarai potru | Sakshi
Sakshi News home page

సూర్య శూరుడు

Apr 14 2019 12:58 AM | Updated on Apr 14 2019 12:58 AM

suriya and sudha kongara new film soorarai potru - Sakshi

‘శూరరై పోట్రు’ ఫస్ట్‌లుక్‌, సూర్య

వీరాధి వీరుడు.. శూరాధి సూరుడు అంటూ పొగిడేస్తారు ఏదైనా గొప్ప పని చేస్తే. లేటెస్ట్‌గా సూర్యని కూడా ఇలానే అంటున్నారు. కారణం ఏంటో సరిగ్గా తెలియాలంటే సినిమా చూడటమే. సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘శూరరై పోట్రు’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. నల్ల చొక్కా, తెల్ల పంచె. చూపులేమో విమానం వైపు. ఆలోచనలు ఎటో? ఇదీ ఫస్ట్‌ లుక్‌. ఎవరెలా అర్థం చేసుకుంటే అలా. ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘శూరరై పోట్రు’.

(శూరులను కీర్తించాలన్నది తెలుగు అర్థం)  తమిళ కొత్త సంవత్సరం (ఏప్రిల్‌ 14) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఎయిర్‌ డెక్కెన్‌  వ్యవస్థాపకులు పైలెట్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘సర్వం తాళమయం’ ఫేమ్‌ అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్‌బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత్‌ గునీత్‌ మోంగ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement