‘ఎన్జీకే’ రిజల్ట్‌పై సూర్య స్పందన | Suriya About Ngk Movie Result | Sakshi
Sakshi News home page

‘ఎన్జీకే’ రిజల్ట్‌పై సూర్య స్పందన

Jun 7 2019 3:22 PM | Updated on Jun 7 2019 3:22 PM

Suriya About Ngk Movie Result - Sakshi

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఎన్జీకే. పొలిటికల్‌ సెటైర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్సాన్స్‌ రాలేదు. కథా కథనాలు ఆకట్టుకునేలా లేకపోవటంతో.. ఎన్జీకే, సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ ఫలితంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సూర్య, తాజాగా సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఎన్జీకే విషయంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నా. మా ప్రయత్నాన్ని, నటీనటుల కష్టాన్ని విశ్లేషించి, ప్రశంసించిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్జీకే తెరకెక్కించేందకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు సూర్య.


Advertisement
 
Advertisement
Advertisement