‘ఎన్జీకే’ రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌కు షాక్‌

Suriya NGK Movie 215 Feet Cutout in Tiruttani Removed - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకే శుక్రవారం విడుదలైంది. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న సూర్య ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అభిమానులు కూడా ఈ మూవీ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో భారీగా ఏ‍ర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుత్తణిలో ఏర్పాటు చేసిన 215 అడుగుల భారీ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఈ కటౌట్‌ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రిలీజ్ సందర్భంగా అభిమానుల ఏర్పాట్లలో ఉండగా గురువారం కటౌట్‌ తొలగించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top