బాసు.. భలే పోజు!

superstar Rajinikanth met the boxing queen Mary Kom - Sakshi

ఇక్కడున్న ఫొటో చూశారుగా! సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాక్సింగ్‌ చేస్తున్నట్లు పోజిచ్చారు. పక్కనున్నది ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరికోమ్‌ అని అందరికీ తెలుసు. కానీ వీళ్లు ఎందుకు కలిశారు? సినిమా కోసమా? అనే ఆలోచనలు తగవు. రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ చెన్నైలో ఓ ఈవెంట్‌ను నిర్వహించారట. ఆ ఈవెంట్‌కి వెళ్లిన మేరికోమ్‌ అలా రజనీకాంత్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రజనీ అభిమానులు బాసు.. భలే పోజు అని సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ సినిమా ట్రైలర్‌ నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అవుతుంది. అలాగే కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘పేట్టా’ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top