జాతీయ గీతం వినిపిస్తే.. నేను నిలబడతా!

Sunny Leone : i standing for National Anthem - Sakshi

సాక్షి, ముంబై : బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లలోనూ జాతీయ గీతం వినిపిస్తే.. నేను మాత్రం తప్పకుండా లేచి నిలుచుంటాను.. అందులో సందేహం లేదని ప్రముఖ బాలీవుడ్‌ నటి సన్నీ లియోని స్పష్టం చేశారు. సన్నీలియోని మాటలతో ప్రముఖ నిర్మాత ఆర్బాజ్‌ ఖాన్‌ కూడా ఏకీభవించారు. ’తేరా ఇంతేజార్‌‘ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు వీరిద్దరు మాట్లాడారు. ఈ సందర్భంగా అర్బాజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఈ మధ్య సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పు పట్టారు. బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లు.. ఇలా ఒక్కడైనా జాతీయ గీతం.. జనగణమణ.. నా చెవులకు వినబడితే.. వెంటనే లేచి నిలబడతా.. అని ఆయన చెప్పారు. ఆలా చేయడం నా జాతికి, స్వతంత్ర సమరయోధులకు నేనిచ్చే గౌరవం అని భావిస్తానని అన్నారు.

బాలీవుడ్‌ యాక్ట్రస్‌ సన్నీ లియోనీ మాట్లాడుతూ.. జాతీయతా స్ఫూర్తి అనేది మన మనసుల్లోంచి రావాలి. ఒకరు చెబితేనో, ప్రభుత్వాలు శాసిస్తేనో జాతీయభావాలు రావు. ఇది మన దేశం.. అన్న భావన, స్ఫూర్తి మనసులో ఉప్పొంగితే దానంతట అదే వస్తుందన్నారు. నాకు జాతీయతా భావాలున్నాయి.. కాబట్టి.. జాతీయ గీతం వినిపిస్తే వెంటనే లేచి నిలబడతాను అని సన్నీ చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top