బన్నీకి చెక్ పెడుతున్న పవన్, మహేష్ | summer war between allu arjun, pawan kalyan, Mahesh babu | Sakshi
Sakshi News home page

బన్నీకి చెక్ పెడుతున్న పవన్, మహేష్

Nov 17 2015 11:55 AM | Updated on Mar 22 2019 5:33 PM

బన్నీకి చెక్ పెడుతున్న పవన్, మహేష్ - Sakshi

బన్నీకి చెక్ పెడుతున్న పవన్, మహేష్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కి సమ్మర్ హీరోగా మంచి రికార్డ్ ఉంది. గత రెండేళ్లుగా సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్స్ సాధించాడు బన్నీ. దీంతో ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్నే టార్గెట్ చేస్తున్నాడు...

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కి సమ్మర్ హీరోగా మంచి రికార్డ్ ఉంది. గత రెండేళ్లుగా సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్స్ సాధించాడు బన్నీ. దీంతో ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్నే టార్గెట్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసిన బన్నీ, ఆ రెండు సినిమాలను 50 కోట్ల క్లబ్లో చేర్చి సత్తా చాటాడు. మరోసారి అదే సీజన్లో, అదే ఫీట్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఈ రికార్డ్ అంత ఈజీగా అందేలా కనిపించటం లేదు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న బన్నీ.. ఆ సినిమాను కూడా సమ్మర్ బరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే గతంలోలా ఈసారి వార్ వన్ సైడ్లా కనిపించటం లేదు. బన్నీకి పోzwగా పవన్, మహేష్లు బరిలో నిలిచే ఛాన్స్ ఉందgటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్, బాబీ దర్శకత్వంలో సర్దార్ గబ్బర్సింగ్ చేస్తున్న పవన్లు తమ సినిమాలను సమ్మర్ హాలీడేస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గత రెండేళ్లుగా పోటీ లేకుండా సోలోగా సత్తా చాటిన బన్నీ, ఈసారి మాత్రం ఇద్దరు టాప్ హీరోలతో పోటీపడాల్సి వస్తోంది. మరి ఇంత పోటీలో కూడా బన్నీ బాక్సాఫీస్ దగ్గర పవర్ చూపిస్తాడా..? లేక ముగ్గురు హీరోలు కలెక్షన్ల రికార్డ్లను పంచుకుంటారా..? తెలియాలంటే మాత్రం సమ్మర్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement