విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో | sumanth wants to do villain role | Sakshi
Sakshi News home page

విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో

Nov 1 2016 10:41 AM | Updated on Sep 4 2017 6:53 PM

విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో

విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుమంత్ రెండేళ్ల విరామం తరువాత ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన విక్కీ డోనర్...

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుమంత్ రెండేళ్ల విరామం తరువాత ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో  ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం నరుడా డోనరుడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సుమంత్, నటుడిగానూ తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. అందుకే అవకాశం వస్తే విలన్ రోల్స్లో కూడా నటించడానికి రెడీ అంటూ ప్రకటించాడు. తనకు రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధుడు లాంటి పాత్రలంటే ఇష్టమని ఆ తరహా పాత్రకోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement