గణపతిదేవునిగా...సుమన్ | suman acting as ganapathi devudu | Sakshi
Sakshi News home page

గణపతిదేవునిగా...సుమన్

May 1 2014 12:04 AM | Updated on Sep 2 2017 6:44 AM

గణపతిదేవునిగా...సుమన్

గణపతిదేవునిగా...సుమన్

ఓరుగల్లు రామప్ప దేవాలయ చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవునిగా సుమన్ నటించారు.

ఓరుగల్లు రామప్ప దేవాలయ చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవునిగా సుమన్ నటించారు. కాశీవిశ్వనాథ్, విన్నీ ముఖ్య పాత్రలు చేశారు, ఓ ప్రత్యేక పాత్రలో సంగీతదర్శకుడు చక్రి నటించారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. సాయిచరణ్ మూవీస్ పతాకంపై కుమార్ మారబోయిన నిర్మిస్తున్న ఈ చిత్రం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రాఫిక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే, చక్రిపై తీసిన ప్రత్యేక పాట యువతను బాగా అలరిస్తాయి. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కథాసేకరణ-స్క్రీన్‌ప్లే: ఎ.ఆర్.కె. సాయి, సమర్పణ: ఆమూరి శైలజామధుసూదన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement