సుదీప్ అత్తారింటికి దారేది | sudip attarintikidaredi movie remake | Sakshi
Sakshi News home page

సుదీప్ అత్తారింటికి దారేది

May 22 2014 11:28 PM | Updated on Sep 2 2017 7:42 AM

సుదీప్ అత్తారింటికి దారేది

సుదీప్ అత్తారింటికి దారేది

కన్నడ అగ్రశ్రేణి నటుడు సుదీప్‌కు దక్షిణాది అంతటా అభిమానులున్నారు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సుదీప్ సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన.

 కన్నడ అగ్రశ్రేణి నటుడు సుదీప్‌కు దక్షిణాది అంతటా అభిమానులున్నారు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సుదీప్ సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా... కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య’ పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు సుదీప్. ఇదే జోష్‌లో మరో రీమేక్‌కి కూడా ఆయన పచ్చ జెండా ఊపేశారు. తెలుగులో రికార్డులు తిరగరాసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కన్నడంలో ఆయన చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయ్యాక సినిమాకు సంబంధించిన వివరాలు తెలుపుతానని సుదీప్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement