‘సమ్మోహన’పరిచేది ఎప్పుడంటే..? | Sudheer Babu Sammohanam Movie Release Date | Sakshi
Sakshi News home page

Mar 11 2018 1:57 PM | Updated on Mar 11 2018 1:58 PM

Sudheer Babu Sammohanam Movie Release Date - Sakshi

‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్‌ బాబు, అదితిరావ్‌ హైదరి

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సుధీర్‌ బాబు. కృష్ణ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన సుధీర్‌ డిఫరెంట్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. మల్టీ స్టారర్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో ప్రతినాయకుడిగానూ నటించి మెప్పించాడు. తాజాగా నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం సమ్మెహనం.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు సరసన అదితీరావ్‌ హైదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను రంజాన్‌ కానుకగా జూన్‌ 15న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement